👉🏽సురక్షిత ప్రయాణానికి జాగ్రత్తలు తప్పనిసరి
అశ్వాపురం: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి ఆటోల్లో ట్రాక్టర్లలో కూలి పనులకు వెళ్లి వస్తున్న మహిళలకు పురుషులకు జాగ్రత్తలు పాటించాలని ప్రమాదాలు చెప్పి రావని రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు ఎవరికి వారు భద్రత నియమాలు పాటించాలని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రశాంతతను పరిరక్షించడం ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని సిఐ అశోక్ రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత, ప్రశాంతతకు భంగం కలిగిన అనంతరం చర్యలు తీసుకోవడం కన్నా... ఏ.. మాత్రం ముందు జాగ్రత్తలు పాటించి అప్రమత్తతో నష్ట నివారణ చేయవచ్చునన్నారు. ప్రజలను, ప్రశాంతతను పరిరక్షించడం, బాదితులకు న్యాయం చేయడం పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యం అని, పోలీస్ శాఖకు నిరంతర ప్రజా సహకారం, కలిగించటమే మా బాధ్యత అని అన్నారు* ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని సూచించారు ఈ.. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
إرسال تعليق