బిచ్చగాళ్ల “వీర్యం”.. అడ్డాకూలీల “అండం”!

 



వీర్యం, అండాల దందాలో వికృత పార్శ్వాలు


చదువురానివారికైతే.. బిర్యానీ పొట్లం, మందు బాటిల్


విద్యావంతులకు రూ.4వేల వరకు చెల్లించి వీర్యం సేకరణ


అండ దానం చేసే మహిళలకు 20-25 వేలు


పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు



బిచ్చగాళ్లకు బిర్యాని.. అడ్డా కూలీలకు మద్యం.. కొంచెం చదువుకున్న వారికైతే రూ. వెయ్యి నుంచి 4 వేలు! అదే మహిళలకైతే రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా ఇస్తారు!! 


హైదరాబాద్ : ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 వీర్యం, అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది!! సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు.. ఆ దాతలు బాగా చదువుకున్నవారై, మంచి తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు. కానీ.. ఈ దందా నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు, అడ్డాకూలీల వీర్యాన్ని, అండాలను! 'ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్' పేరుతో సికింద్రాబాద్లో ఈ దందా నడుపుతున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఈ క్లినిక్ యజమాని, మేనేజర్గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా, టెక్నీషియన్లుగా నియమించుకున్నాడు. వారు.. బిచ్చగాళ్లకు, అడ్డాకూలీల వంటివారికి డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు.


ఆర్ట్ (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ) నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి, అదీ 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్నవారి నుంచి.. వారికి అన్నిరకాల వైద్యపరీక్షలూ నిర్వహించి, ఎలాంటి జన్యువ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్ఠంగా 25సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి. కానీ.. స్పెర్మ్ క్లినిక్లు ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని ఒకే వ్యక్తి నుంచి వారానికొకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నాయి. ఉదాహరణకు.. ఇండియన్ స్పెర్మ్టెక్ ఏజెంట్లు బిచ్చగాళ్లు, అడ్డాకూలీలను సంప్రదించి.. "వారానికోసారి ఇక్కడకు వచ్చి మేం చెప్పినట్లు చేస్తే మందుతో పాటు బిర్యానీ ఇప్పిస్తామంటూ వారికి ఆశపెట్టేవారని తెలిసింది. లేదంటే వాటికి సరిపడా రూ 500-1000 చేతిలో పెట్టి పంపేవారని సమాచారం. అలా వచ్చేవారు.. తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే.. వారి నుంచి అండాలు సేకరించేవారు. అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారీ రూ.20 వేల నుంచి రూ.25 వేలు చెల్లించేవారని తెలిసింది. నిందితులను మరోసారి కస్టడీకి తీసుకొని విచారించేందుకు గోపాలపురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.



ఇది కూడా చదవండి...





హై కోర్ట్ నందు ఏజెన్సీ లో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై విచారణ, పిటిషన్ దాఖలు చేసిన ఆదివాసి సేన 



నేడు అనగా 29.07.2025న, 

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై విచారణ చేపట్టాలని కోరుతూ రిట్ పిటిషన్ నంబర్.22007/2025 ద్వారా ఆదివాసీ సేన తరుపున  దాఖలు చేసిన పిటిషన్ పైన  ఈరోజు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ గారు విచారణ చేపట్టడం జరిగినది. ఈ యొక్క పిటిషన్ నందు విచారణలో ఆదివాసి సేన తరుపున న్యాయవాది సి. హెచ్.రవికుమార్ గారు మరియు సోడే  వెంకటేశ్వర్లు గార్లు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం వారు జారి చేసిన జీవో లు మరియు మెమో లను అనుసరించి, ఏజెన్సీ ప్రాంతాలలో ఎటువంటి మినహాయింపు పాటించలేదని  మరియు ముఖ్యంగా LTR మరియు పీసా నిబంధనలకు విరుద్దంగా గిరిజనేతరులకు ప్రభుత్వం వారు ఇండ్లు కేటాయించడం చట్ట విరుద్ధం అని, వెంటనే గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతాలలో కేటాయించిన ఇండ్లను రద్దు పరచాలని కోరారు. వాదనలు విన్న గౌ. ధర్మాసనం.. ప్రభుత్వం వారిని తగిన సమాచారంతో హాజరవ్వలసిందిగా గౌరవ ధర్మాసనం ఆదేశిస్తూ ఉత్తర్వులు జారి చేస్తూ,  తదుపరి విచారణ ఆగస్టు- 5 వ తేదికి వాయిదా వేసినది.


ఇట్లు 

వజ్జ జ్యోతి బసు,

ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు.


Post a Comment

أحدث أقدم