ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ — మావోయిస్టు కమాండర్ ఉధమ్ సింగ్ మృతి

G Rajashekar
By -
0

 


ఛత్తీస్‌గఢ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెద్ద గలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కమాండర్ ఉధమ్ సింగ్ మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు.

సంఘటన స్థలం నుంచి ఆటోమేటిక్ AK-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఎదురుకాల్పులు పూర్తిగా ముగియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భద్రతా దళాలు కఠిన చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)