వచ్చే ఎన్నికలకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలి- నియోజకవర్గ కన్వీనర్ పున్నం బిక్షపతి



 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక బిజెపి మండల శాఖ, పినపాక మండలంలోని జానంపేటలో స్థానిక సంస్థల బిజెపి ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరిగింది. పినపాక మండల అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ పున్నం బిక్షపతి హాజరైనారు. ఈ కార్యాలయం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.... వచ్చే ఎన్నికలకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని మండల అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో పినపాక మండలంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడని అలాగే కార్యకర్తలందరూ కష్టపడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డ్ మెంబర్లగా పోటీ చేయాలని ప్రజాప్రతినిధులు కావాలని ప్రజలకు సేవ చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పటేల్ వెంకట్ నారాయణ పొనగంటి రామకృష్ణ గంప చంద్రకుమారి పాటిబండ్ల శ్రీనివాస్ పొనగంటి సతీష్ షేర్ మల్లయ్య మరియు భూత అధ్యక్షులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم