పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి కొండా తిరుపతి రెడ్డి , శచీదేవి దంపతులు 50వేల విరాళాన్ని గురువారం అందజేశారు. శచీదేవి తండ్రి గారైన కంది పెద్ద వెంకటరెడ్డి జ్ఞాపకార్ధంగా ఆలయానికి 50,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి సుమారు 5 లక్షలు అవసరం కాగా దానిలో భాగంగా 50,116 వేల విరాళాన్ని అందజేసినట్లుగా తెలియజేశారు. అన్నదాన సత్ర నిర్మాణానికి దాతలు ఉంటే సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి అంబడిపూడి ప్రసాద్ శర్మ, కొండ తిరుపతిరెడ్డి, చిత్తూరు సత్తిబాబు, మాలపాటి రామిరెడ్డి, కంది సుబ్బారెడ్డి, మునిగిల శ్రీను, ధనలక్ష్మి, సూరసాని రాంబాబు,భక్తులు పాల్గొన్నారు
إرسال تعليق