కరకగూడెం: మేకల పై దాడి చేసిన పెద్దపులి

 గ్రామస్తులు 10 రోజుల వరకు అడవిలోకి వెళ్ళొద్దని చాటింపు; అటవీ అధికారులు 

కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;



రఘునాథ పాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల అటవీ ప్రాంతం లో బుధవారం పులి సంచరించినట్లు పశువుల కాపరులు తెలిపారు. బుధవారం పాల ఓర్రెలు, అందుగుల మీది , ఇసుక మీది అటవీ ప్రాంతం లో కొమరం నర్సయ్య మేకల మీద పులి దాడి చేయడం జరిగిందని కాపరులు తెలిపారు. వెంటనే దగ్గర లో ఉన్న పశువుల కాపరులు, మేకల కాపరులు గోల చేయడం తో అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి పోయిందని అన్నారు.. అంతే కాకుండా అటవీ అధికారులు గ్రామస్తులను 10 రోజుల వరకు అటవీ ప్రాంతం లోకి మేకలను , పశువులను తీసుకొని వెళ్లొద్దు అని అటవీ అధికారులు గ్రామంలో చాటింపు వేయించారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Post a Comment

أحدث أقدم