పినపాక: సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్ పట్ల అవగాహన కార్యక్రమం

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలియని వ్యక్తి ఫోన్లో ఓటిపి అడిగితే చెప్పకూడదని హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అన్నారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... డిజిటల్ లావాదేవీలు ఎక్కువైనందున సైబర్ నేరాలు కూడా అధికమయ్యాయి అన్నారు. మొబైల్ కు వచ్చే తెలియని లింకులను ఓపెన్ చేయరాదన్నారు. ప్రతి ఒక్కరు ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని వెల్లడించారు. అనంతరం గంజాయి, డ్రగ్స్  వంటి మాదక ద్రవ్యాలు వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. కొందరు యువత తెలియకుండా గంజాయి వంటి సేవిస్తూ చెడు మార్గంలో వెళ్తున్నారన్నారు. తల్లిదండ్రులు మీ పిల్లలు చెడు మార్గంలో ఏమైనా వెళ్తున్నారా అని ఓ కన్నేసి ఉంచాలన్నారు. ఎంతోమంది గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు వాడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఎవరు కూడా అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم