పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం శివారు బీటీపీఎస్ వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంత గంజాయి దొరికింది అన్న పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి....
తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో :*కొత్తగూడెం,* భూపాలపల్లి, కామారెడ్డి, *ఖమ్మం*, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.పురాతన ఇళ్లలో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలన్నారు. వాగులు, కాజ్‌వేలు, కల్వర్టులపై రాకపోకలు నిషేధించాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.అంటువ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
إرسال تعليق