మణుగూరు: ఇంకో ట్రైన్ నడిపేలా చూడండి




మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 కరోనా టైం లో నిలిపివేసిన మణుగూరు రావాల్సిన ట్రైన్లు అన్ని తిరిగి నడపవలసిందిగా మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరికే బలరాం నాయక్ ని మణుగూరు ప్రజలు కోరుతున్నారు.

ఈ పార్లమెంట్ సమావేశంలో రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి రద్దయిన సంబంధిత రైలను తిరిగి నడిచేటట్లు ఈ ప్రాంత ఎంపీగా చొరవ చూపాలని మణుగూరు చుట్టుపక్క ప్రాంతాలలో భద్రాద్రి పవర్ ప్లాంట్ హెవీ వాటర్ ప్లాంట్ సింగరేణి గనులు పేపర్ బోర్డ్ తదితర భద్రాచలం దైవదర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి అచ్చి పోయేవారికి అనుకూలంగా గతంలో రైళ్లు రాకపోకలు సాగించాయని కరోనా టైంలో రద్దు కావడంతో ఒకే ఒక్క ట్రైన్ తో ప్రయాణికుల రద్దీతో చాలా ఇబ్బంది ఏర్పడుతుందని రైలు ప్రయాణికుల ఆవేదనను అర్థం చేసుకొని రద్దయిన రైళ్లలో తిరిగి నడిచే విధంగా భారత రైల్వే శాఖ అధికారులతో సంప్రదించగలరని మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ మణుగూరు ప్రజలు🙏





ALSO READ...

✍️వర్షంలో తడుస్తూ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రజా సేవకురాలు మంత్రి సీత‌క్క‌._


 


✍️ ఆమె తెలంగాణ రాష్ట్రానికి మంత్రి. మంత్రి హోదాలో ఉంటూ ఏసీ గదుల్లో ఉండి అధికారులకు ఆదేశాలు జారీ చేయొచ్చు, కానీ సీతక్క అలా కాదు, ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ వారి కంటే ముందుగా స్వయంగా పరిస్థితులను సమీక్షిస్తుంది. వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేస్తుంది. అదే కోవాలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న తరుణంలో మంత్రి సీతక్క గారు ఈ రోజు ములుగు జిల్లాలో పర్యటించారు. మంత్రి అధికారిక పర్యటనలో భాగంగా ములుగు జిల్లా పరిధిలోని పసర–తాడ్వాయి మార్గ మధ్యలో ఉన్న జలగలంచ గుండ్ల వాగు వరద పరిస్థితిని ఆమె స్వయంగా పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా అధికారులు వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలను ముందుగానే హెచ్చరించాలనే ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు ములుగు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే ఆ నంబర్‌కు కాల్ చేయాలని ప్రజలను ఆమె కోరారు. విద్యుత్ తీగలు పడిపోయిన చోట రైతులు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ షాక్ ప్రమాదాలకు గురి కాకుండా త‌గిన జాగ్ర‌త‌లు పాటించాల‌ని సూచించారు. వాగులు, వంకలు. గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించి, అటువంటి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కింది స్థాయి అధికారులతో సమన్వయంగా మానిటరింగ్ చేయాలని ఆమె ఆదేశించారు._

Post a Comment

కొత్తది పాతది