అశ్వరావుపేట లో జరిగే సిపిఐ జిల్లా 3వ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ మణుగూరు నుండి అశ్వరావుపేటకు అమరవీరుల స్మారక యాత్ర

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


:అశ్వరావుపేట వేదికగా ఈ నెల 26, 27,న జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ అమరవీరుల స్మారక యాత్రను మణుగూరు పార్టీ కార్యాలయం దగ్గర నుండి ప్రారంభించడం జరిగింది యాత్రను ప్రారంభించిన పినపాక నియోజకవర్గ కార్యదర్శి పుల్లారెడ్డి జ్యోతిని వెలిగించి మణుగూరులో ప్రదర్శన నిర్వహిస్తూ 

ఈ యాత్రను కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, జిల్లా ఉపాధ్యక్షుడు అక్కినపల్లి నాగేంద్రబాబు, 

ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉమ్మ గాని హరీష్, సహాయ కార్యదర్శి సయ్యద్ జాకీర్, మణుగూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతిని వెలిగించి ఈ యాత్రను కొనసాగించాలని విద్యార్థి యువజన సంఘాలకు జ్యోతిని అప్పగించడం జరిగింది.

 అనంతరం అశ్వాపురం చేరుకున్న అమరవీరుల స్మారక జ్యోతి యాత్ర కొనసాగించుకుంటూ హెవీ వాటర్ ప్లాంట్ గౌతమ్ నగర్ కాలనీ దగ్గర, ఏఐటీయూసీ నాయకులు బర్ల ప్రసాద్ గారి, స్మారక స్థూపానికి సిపిఐ మండలం సహాయ కార్యదర్శి మేలపుర సురేందర్ రెడ్డి, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, అనంతరం జ్యోతి యాత్ర కొనసాగాలని కోరారు,,


 ఈ కార్యక్రమంలో

ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్, సిపిఐ మండలం సహాయ కార్యదర్శిలు, చలికాని శ్రీనివాస్, ఏవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిలు సయ్యద్ జాకీర్, రెడ్డిబోయిన వెంకన్న, రాజ్ కమల్, తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

أحدث أقدم