మాల జన సమితి (MJS) ఆధ్వర్యంలో గౌతమి బుద్ధుడు 2587 బుద్ధ జయంతి వేడుకలు




 అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం గ్రామం కాలవబజార్ లో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి..


 మాల జన సమితి అధ్యక్షుడు చెట్టి సురేష్ మొదటిగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

 


ఈ సందర్భంగా చెట్టిసురేష్ మాట్లాడుతూ,విశ్వ జ్ఞాన సంపన్నుడు సిద్దార్థ గౌతమ బుద్ధుని జయంతి ( బుద్ధ పూర్ణిమ ) జరుపుకోవడం సామాజిక బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేశారు..


ప్రపంచంలోనే మొట్టమొదటి సామజిక విప్లవకారుడు, ప్రజ్ఞ కరుణ శీలలతో మనిషికి ' మనస్సే ' ప్రధానం అని చెప్పి "మధ్యే మార్గాన్ని" సూచించిన మహనీయుడు,ప్రజల మధ్య ప్రేమ, దయ, కరుణ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మానవత్వం లేని రాజ్యం తనకు వద్దని,రాజ్యాన్ని, రాజ్యం ఇచ్చే భోగ భాగ్యాలను వదలి,2500 సంవత్సరాల క్రిందటే 29 సంత్సరాల నవ యవ్వనములో రాజ్యాన్ని తృణపాయంగా త్యజించి , సమ సమాజము కోసము పరితపించిన మానవతా మూర్తి,విశ్వమానవాళికి సహనాన్ని, ప్రేమతత్వాన్ని, అహింసను, శాంతిని పంచిన బుద్ధుని బోధనలు సదా ఆచరణనీయం, ఆ మహనీయుని బాటలో ప్రతీ ఒక్కరూ నడవాలని ఆకాంక్షిస్తున్నామని తెలియజేశారు..


ఈ కార్యక్రమంలో చెట్టి మల్లేష్ జూపల్లి ధ్రువ కుమార్ , కాల్వ వనజాక్షి,షారుక్ పాషా,జూపల్లి సుశీల తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم