తెలంగాణ : శాశ్వత భూ పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 14 వ తారీఖున ధరణి పోర్టల్ స్థానం లో భూ భారతి పోర్టల్ తీసికొచ్చిన విషయం తెలిసిందే... ప్రతీ మండలం లో జిల్లా కలెక్టర్ భూ భారతి పోర్టల్ గురించి అవగాహన కల్పించారు...
కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
భూభారతి చట్టాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 5 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని మండలంలో ఈ రెవెన్యూ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ రెవెన్యూ సభలకు హాజరై, ప్రజల సందేహాలను అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు.
ఇది కూడా చదవండి....జాను రెండో పెళ్లి ? సంచలన ప్రకటన
కామెంట్‌ను పోస్ట్ చేయండి