జాను రెండో పెళ్లి ? సంచలన ప్రకటన

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జాను వివాహం విషయం సంచలనంగా మారింది. స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా రెండో పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పారు. 


సోషల్ మీడియా వేదికగా జాను ఇలా అంది...


'' ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సారీ.....


నేను ఏదైతే వీడియో చేశానో దానివల్ల చాలా మంది బాధ పడ్డారు.. రియాక్ట్ అయ్యారు...చాలా మంది సపోర్ట్ చేశారు.


సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్యూ సో మచ్...


నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా... ఏది ఎప్పుడూ పట్టించుకోలే కానీ.. కొంచెం బాధ అనిపించి డిప్రెషన్ లోకి వెళ్ళా...నా ఫ్యామిలీ బాధ పడుతుంటారు ఆ సిచువేషన్లో అట్లనే ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా...


నేను ఎవరికీ భయపడే దాన్ని కాదు. భయపడితే ఈ స్టేజిలో నేను ఉండేదాన్ని కాదు.


నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ ని మీ అందరికీ తెలుసు.


ఇంకో విషయం పెళ్లి గురించి అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా? 


నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను.


నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంతోనే నేను మీకు ఆన్సర్ చెప్తా నిన్న తీసిన వీడియోలు కూడా కొంతమంది మంచిగ తీసుకున్నారు కొంతమంది చెడుగా తీసుకున్నారు.


ఆ ట్రోలింగ్స్ ఎప్పటికైనా ఆగవు. 


నాకు అది అర్థమైంది దాని నేను అది పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. 


నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటా ఇంకా ముందుకు వెళ్తా "


మీ జాను అక్క ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.


ఇది కూడా చదవండి....భద్రాద్రి: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి



Post a Comment

కొత్తది పాతది