పదవ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థినిలకు సన్మానం...



అశ్వారావుపేట, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్, ప్రతినిధి సతీష్ గౌడ్:


పదవ తరగతిలో 500 మార్కులు దాటినా విద్యార్థినిలకు సన్మానం...


అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట పంచాయతీలో ZPSS మామిళ్ళవారిగూడెంలో చదివి పదవ తరగతి పలితాలలో తిరుమలకుంట గ్రామానికి చెందిన 500/600 మార్కులు దాటినా విద్యార్థినిలకు కారం సుస్మిత(541), సోడెం వెంకటరమణ(525), తలగాని నాగ వేంకట భావన(517), మార్గణి వైష్ణవి(517), నారం అక్షయ(510), వీరంకి సాయి హర్షిత(507), గ్రామస్థులు సన్మానం చేసారు. తల్లిదండ్రులు పిల్లల నుండి ఆశించేది డబ్బో ఇంకా వెరెనో కాదని అందరిలో మంచి పేరు తెచ్చుకొని వారికి మంచి పేరు తేవాలని, మంచి ప్రయోజకులు ఐతే ఆ తల్లిదండ్రులు పడే సంతోషం మాటల్లో చెప్పలేనిది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుజ్జూరి దుర్గారావు, ఉమ్మల లచ్చిరెడ్డి, టెలికామ్ అడ్వేజరీ కమిటీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గడ్డం ఏసు, గ్రామ ఉపాధ్యక్షుడు మోడియం శ్రీనివాసరావు, మాడి గంగరాజు, బొర్రా వెంకటేశ్వరావు ,మొద్దు మరియమ్మ, పరికల రాంబాబు, కోర్స రాజేష్, మోడియం వీరేశ్వరరావు, తలగాని చిట్టిబాబు, మడకం అంజిబాబు, కొత్తపల్లి సీతారామయ్య వీరంకి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది