సైన్యం శౌర్యానికి, శాస్త్రవేత్తల తెలివితేటలకు, దేశ ప్రజల ఐక్యతకు సెల్యూట్: మర్రి మల్లారెడ్డి
అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్:
దేశ భద్రత, మహిళల గౌరవ రక్షణ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమై దేశ ప్రజల మనోభావాలకు న్యాయం చేసిన ఘటనగా నిలిచిందని మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
పహల్గామ్‌లో ఉగ్రవాదులు నిర్వహించిన దారుణ దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై నిర్వహించిన ఈ ప్రతీకార చర్య దేశ భద్రతా చరిత్రలో ఓ తిరుగుబాటు ఘట్టంగా నిలిచిందన్నారు.
ఈ మేరకు మల్లారెడ్డి మాట్లాడుతూ, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రతి భారతీయుడి హృదయాన్ని కలచివేసింది.
కుటుంబ సభ్యుల కళ్లముందే తమవారిని ఉగ్రవాదులు హత్య చేయడమంటే మానవత్వాన్ని అణచివేయడమే. అటువంటి కుట్రలకు కేంద్రం తగిన సమాధానంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది అని తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో భారత క్షిపణులు, డ్రోన్లు ఉగ్ర శిబిరాలపై ఖచ్చితంగా దాడులు చేసి, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు, వారి సైనిక స్థావరాలు, వైమానిక కేంద్రాలపై సమర్థవంతమైన ఆక్రమణలు జరిపినట్టు వివరించారు.
పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శరణు వేడిన స్థితి చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, ప్రతిష్టను నిలబెట్టుకున్నది అన్నారు.
మన కూతుళ్లు, తల్లుల నుదుటి సిందూరాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తే, దానికి దిగజారిన శక్తులు ఏమవుతాయో చూపించాం.
ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతినిధిగా నిలిచింది అని మల్లారెడ్డి స్పష్టంచేశారు.
ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఉటంకిస్తూ, మే 6 అర్ధరాత్రి నుంచి మే 7 ఉదయం వరకు జరిగిన దాడులు భారత శక్తిని ప్రపంచానికి చాటించాయి.
శత్రువులకు తగిన బుద్ధి చెప్పడంలో భారత సాయుధ దళాలు కీలకపాత్ర పోషించాయి. వారి వీరోచిత చర్యలను దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు అంకితంగా అర్పించాలి అని పేర్కొన్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై దాడులు జరిపినప్పటికీ, దాని నైతిక విలువలపై కూడా గట్టి దెబ్బ తగిలింది.
భారతదేశం తన సైనిక మౌలిక వనరుల సామర్థ్యాన్ని చూపించింది.
పాకిస్తాన్ భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, మరిన్ని చర్యలు తప్పవని స్పష్టంచేశాం అని మల్లారెడ్డి హితవు పలికారు.
ఉగ్రవాదానికి ఆసరా ఇస్తున్న పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం తమ దేశాన్ని తామే నాశనం చేసుకుంటున్నాయి.
ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయకపోతే, ఆ దేశానికి మనుగడలే శూన్యమవుతుంది.
భారతదేశం ఇకపై ఎలాంటి అణు బెదిరింపులను భరించదు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు భారత దేశం సిద్ధంగా ఉంది అని మల్లారెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన, ప్రధాని మోదీ, సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజల ఐక్యతకు సెల్యూట్ చేస్తూ, ఈ విజయాన్ని దేశంలోని ప్రతి మహిళకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్... ఘోరం రోడ్డు ప్రమాదం లో వ్యక్తికి తీవ్ర గాయాలు...
إرسال تعليق