కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి రాజబాబు:
తెలంగాణ రాష్ట్ర, రోడ్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి వర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి నూతన బస్సు స్టేషన్ మంజూరు చేయాలనీ కోరినా కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ నాయకులు.....
తేది :అనగా 04:05:2025 ఆదివారం రోజున ములుగు జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథులు వచ్చిన రాష్ట్ర రోడ్ రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి వర్యులు సీతక్క గారితో పాల్గొన్నారు, కావున మంత్రి సీతక్క గారితో కలిసి రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి కన్నాయిగూడెం మండలానికి నూతన బస్ స్టేషన్ మంజూరు చేయాలి అని మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన కన్నాయిగూడెం మండల నాయకులు..
కావున గత ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడిన మా కన్నాయిగూడెం మండలం ఇప్పటివరకు ఎటువంటి బస్ స్టేషన్ లేదు మా మండలం నుండి పెద్ద సంఖ్యలో రోడ్ రవాణా జరుగుతుంటుంది పక్కనే ఉన్న ఏటూరునాగారం నుండి నూతంగా ఏర్పడిన పలిమల నుండి అంబాట్పల్లి, మహాదేవ్పూర్, భూపాలపల్లి, మరియు కాళేశ్వరం సిరివంచే మహారాష్ట్ర, నుండి చత్తిష్ఘడ్, బుపాలపట్నం కు రోజు వారీగా ప్రయాణికులు ప్రయానిస్తూ ఉంటారు కావునా మా కన్నాయిగూడెం మండలానికి బస్సు స్టేషన్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని లేఖలో పేర్కొన్నారు కావున గత ప్రభుత్వం లో నూతనంగా ఏర్పడిన మా మండలం అప్పటి ప్రభుత్వ మంత్రులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన వారు పట్టించుకోలేదు కావున దయచేసి మా మండలనికి బస్ స్టేషన్ కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కోరి వినతి పత్రం అందించిన కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ నాయకులు....
ఈ కార్యక్రమం కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఎండి, అప్సర్ పాషా, మండల ఇంచార్జి జాడి రాంబాబు, sc st అట్రాసిటీ ములుగు జిల్లా కమిటీ మెంబెర్ సునార్కని రాంబాబు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాటి రాజబాబు, బీసీ సెల్ మండల అధ్యక్షులు గడ్డం నగేష్,మండల యూత్ అధ్యక్షులు బోట నాగేష్, యూత్ ఉపాధ్యక్షులు కుమ్మరి వెంకట్, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సునార్కని సాంబ శివ, మండల కో ఆర్డినేటర్, దుర్గం ప్రభాకర్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు యాకుబ్ పాషా, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ శిషిందర్,కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ నాయకులు చిట్యాల అరుణ్,పళ్ళ లచ్చబాబు,పళ్ళ శ్రీనివాస్, లచ్చబాబు, గడ్డం రవీందర్ సిద్దబోయిన సాగర్,సుమన్ మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు...
إرسال تعليق