మణుగూరుకు నూతన తాసిల్దారుగా నిన్న జరిగిన జిల్లా రెవిన్యూ అంతర్ బదిలీలలో నియమితులయ్యారు
గత కొంతకాలంగా మణుగూరులో అసైన్డ్ భూముల భూ దందాలో ప్రభుత్వ భూములు అక్రమాలకు గురికావడం పోలీస్ కేసులు నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ గా పై విషయాలపై దృష్టి సాగడంతో ఒకే మాసంలో తాసిల్దార్ బదిలీ కాగా మరొక నూతన తాసిల్దార్ రావడం ఆయన కూడా నెలరోజులు తిరగకముందే రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ల బదిలీలలో బదిలీ కావడం జరిగింది.
తిరిగి నిన్న జిల్లా తాసిల్దార్ ల అంతర్ బదిలీలలో
అద్దంకి నరేష్ ను మణుగూరుకు బదిలీ చేయడం జరిగింది.
మణుగూరు ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ అవసరాలకు వినియోగించే దిశగా ప్రభుత్వ భూ అక్రమాల దారులపై కఠిన చర్యలకు సైతం వెనుకాడకుండా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా నిక్కచ్చిగా ముక్కుసూటిగా వ్యవహరించే తాసిల్దార్ ను నియమించడంతో
రానున్న రోజుల్లో భూదందా పైరవీకారులకు అడ్డుకట్ట వేసే విధంగా జిల్లా రెవెన్యూ పాలన యంత్రాంగం మణుగూరు పై దృష్టి పెట్టడంతో అసైన్డ్ భూముల అక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి ఎప్పుడు ఏమవుతుందో అని రాజకీయ నాయకుల పంచన చేరుతున్నట్లు ప్రచారం.
ఇది కూడా చదవండి...భద్రాద్రి జిల్లాలో పెద్దపులి సంచారం
కామెంట్‌ను పోస్ట్ చేయండి