మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
అకాల వర్షాలకు తడిచిన ధాన్యన్ని కొనుగోలు చేయాలని సామాజిక కార్యకర్త కర్నె రవి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
మణుగూరు మండలానికి చెందిన సామజిక కార్యకర్త కర్నె రవి సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కర్నె రవి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పినపాక నియోజకవర్గం లోని అనేక మండలాల్లో వర్షాల కారణంగా తడిచిన ధాన్యన్ని, తరుగుదల లేకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోని రైతులు నుండి కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం వర్షానికి తడవకుండా టార్బన్ లను అందించాలని ఆయన డిమాండ్ చేశారు..అకాల వర్షాలు రైతులు పండించిన ధాన్యం తడిచిపోయింది అని, దీనితో రైతులు నష్టపోయారు అని అన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద తడిచిన ధన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ రోజు రోజుకు పెరిగితుందన్నారు. కాబట్టి వెంటనే రైతుల తడిచిన ధన్యాన్ని కొనుగోలు చేసి న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి