భద్రాద్రి జిల్లాలో... చిరుత పులి కలకలం




 భద్రాద్రి కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చిరుత పులి కలకలం రేపింది. 


ఓ కొబ్బరి తోటలో రైతుకు చిరుతపులి కనిపించిందని ఈరోజు ( బుధవారం ) తెలిపారు. 


రైతులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో అటవీ సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు.


 తమ ప్రాంతంలో చిరుత పులి సంచరించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.


వేల్పుల కుంట చెరువు పూడిక తీసి సాగునీరు అందించాలి.....


పి.కె.ఓ.సి.2 ప్రాజెక్ట్ అధికారికి రైతుల వినతి 


మణుగూరు : మండలంలోని పగిడేరు గ్రామ పంచాయతీ గల వేల్పుల కుంట చెరువు పూడిక తీసి సాగునీరు అందించాలని

ఆయా కట్టు రైతులు తరపున బుధవారం 

సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆధ్వర్యంలో పి.కె.ఓ.సి.2 ప్రాజెక్ట్ అధికారి తాల్ల పల్లి లక్ష్మీపతి గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వేల్పులకుంట చెరువు ద్వారా సుమారు 50 ఎకరాల భూమికి ఆయకట్టు ఉందన్నారు. చెరువులో పూడిక పేరుక పోవడంతో నీరు బయటకు రావడం లేదన్నారు.


 వర్షం కాలం లో వరి సాగు చేశామని, నీరు అందక పోవడంతో పొలాలు ఎండిపో

యాయని చెప్పారు. పనులు చేపట్టక పోతే పంట వచ్చే సంవత్సరం కూడా పంట 

నష్టపోతామని, వేల్పుల కుంట చెరువు పూడిక తీసి గొర్రె పెంట వాగు ద్వారా వచ్చే వర్షాకాలంలో నీటిని చెరువుల్లోకి మళ్లించి నీరందేలా చర్యలు చేపట్టాలని కోరారు. 


దీంతో ఆయకట్టు అభివృద్ధి చెంది రైతులకు జీవనోపాధి లభిస్తుందని 

రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తికి స్పందించిన ప్రాజెక్టు అధికారి లక్ష్మీపతి రైతుల విజ్ఞప్తిని సింగరేణి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తారని వారికి హామీ నీచ్చారు.


ఈ కార్యక్రమంలో శాంతినగర్ గ్రామస్తులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి...కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు


మావోయిస్టు పార్టీ సంచలన లేఖ


రెండు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

Post a Comment

కొత్తది పాతది