కన్న తల్లి లాంటి ఊరికి చేయూతనిచ్చి మంత్రి సీతక్క.




 ములుగు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మహిళా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క.



ములుగు జిల్లా లో మంత్రి సీతక్క  ఈరోజు సుడిగాలి పర్యటనలు చేశారు. మహిళా స్వాలంబన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్వగ్రామమైన జగ్గనపేటలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. తగనంతరం  మంత్రి  డా. దనసరి అనసూయ సీతక్క  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ...ఇల్లాలి అక్షరాస్యత ఇంటికి వెలుగు అని, ఇల్లాలి "ఆర్థిక అక్షరాస్యత ఈ దేశానికే వెలుగు" అని ప్రగాఢంగా నమ్మిన మన  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  సారథ్యంలో మహిళలను కోటీశ్వరులను చేయాలని ఉద్దేశంతో, మహిళలు ఆర్థిక స్వావలంబనతో ఎదిగేలా చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వo ముందుకు వెళ్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో స్త్రీని ఇంటి మహా లక్ష్మిగా భావించడం జరుగుతుందని, అందులో భాగంగానే మన ప్రజా ప్రభుత్వం మహా లక్ష్మీ ఉచిత బస్సు పథకం తీసుకు రావడం జరిగిందని అన్నారు. అన్ని విషయాల్లో మహిళలు కూడా భాగస్వామ్యం వహించేలా వంటింటి నుండి వారి అడుగు బయటకు పడేలా ఒక గుణాత్మకమై మార్పును తీసుకు వచ్చిందని అన్నారు. మన ప్రజా ప్రభుత్వము తీసుకు వస్తున్న ప్రతీ పథకం యొక్క ఉద్దేశ్యం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చి తద్వారా సాధికారతను సాధించడమే అని అన్నారు. అందులో భాగంగానే వివిధ రంగాల్లో మహిళలకు విశేషమైన ప్రోత్సాహం అందించడం జరుగుతుందని అన్నారు. మన తెలంగాణా ప్రభుత్వం ఆ కోణంలోనే ఆలోచించి మహిళలకు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో బస్సులు కొనుగోలు చేసి తెలంగాణా RTC కి అద్దెకివ్వడం ద్వారా వారిని ఓనర్లుగా తీర్చిదిదడం జరుగుతుందని ఇలా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని అన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు మరేదైనా ఇతర సంక్షేమ పథకాలు అన్నీ ఇంటి ఆడబిడ్డ పేరు మీదనే మంజూరు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలను చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే మహిళలకు ఈ ఉచితకుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. మహిళా సాధికారత కేంద్రం మరియు డేటా ప్రో సంస్థ (NGO) ల ఆధ్వర్యంలో ప్రారంభించుకున్న ఈ శిక్షణ ద్వారా మీరంతా స్వయం ఉపాధి వైపు అడిగేయాలని, మీరు ఇప్పుడు వేసే ఈ తొలి అడుగులే ఓ మహా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేలా ముందుకు తీసుకు వెళతాయని, కాకపోతే దానికి తగిన ఓర్పు, పట్టుదల, అంకిత భావం, ముఖ్యంగా కుటుంబం నుండి ప్రోత్సాహం అవసరం అని ఈ శిక్షణకు వచ్చిన మహిళలకు సూచించారు. అనంతరం ఈ శిక్షణలో పాల్గొనబోతున్న అక్కా చెల్లెల్లు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

Post a Comment

కొత్తది పాతది