బయ్యారం క్రాస్ రోడ్ లో జోరుగా టపాసులు అమ్మకాలు... నిర్లక్ష్యం వయిస్తున్న అధికారులు

 


పినపాక: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


దీపావళి పండుగ సందర్భంగా ఈ బయ్యారం క్రాస్ రోడ్లో టపాసుల అమ్మకాలు  జన సమూహాల వద్ద జోరుగా జరుగుతాయి. 

వ్యాపారులు ప్రత్యేక స్థలాల్లో అనుమతితో షాపులు ఏర్పాటు చేసి టపాసులు అమ్మకాలు జరపాలి.


ప్రజల మధ్య ప్రమాదకరమైన టపాసులు ఉంచితే జరగరాని ఏమైనా ప్రమాదం జరిగితే ఎంతో నష్టం జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. 



అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ సేఫ్టీ ఏర్పాట్లు కూడా తప్పనిసరిగా ఉండాలి. పండుగ సమయంలో ఏవైనా ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సంబంధిత అధికారులు పర్యవేక్షణలో ఉండాలి.


సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

కొత్తది పాతది