పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంటులో కరకగూడెం మండలం రంగాపూర్ కొత్తగూడెం జట్టు విజేతగా నిలిచింది. దమ్మపేట మండలం, గణేశ్‌పాడు జట్టు రన్నరప్‌గా నిలిచి రెండవ స్థానాన్ని సాధించింది. ఈ పోటీలను ఆసక్తికరంగా సాగగా, ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది. విజేత జట్టుకు రూ.30,000 నగదు బహుమతి ప్రధానించి సన్మానించారు. రన్నరప్‌గా నిలిచిన గణేశ్‌పాడు జట్టుకు రెండో బహుమతిగా రూ.20000 అందజేశారు.
గ్రామస్థులు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరై జట్లకు ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఈ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ క్రీడలకు కొత్త ఊపును ఇవ్వడమే కాకుండా యువతకు క్రీడాస్పూర్తిని నింపిందని నిర్వాహకులు తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి