కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెం పద్మ పురం గ్రామానికి చెందిన సాదు అశోక్ 10 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న వరి పంట రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నీటమునిగిపోయింది.
ఈ వర్షం వల్ల నేలమట్టం జలమయమై పంటకు తీవ్ర నష్టం కలిగినట్లు తెలుస్తోంది. రైతు కుటుంబీకులకు ఇది పెద్ద ఆందోళనగా మారింది. కొన్ని ఇతర గ్రామాల్లో కూడి విస్తృతంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని ఈ సందర్భంగా రైతు అశోక్ కోరుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి