పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు ఉదయం లారీ ఒక ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ అతని బైకు మాత్రం దెబ్బతింది.
ఈ ఘటన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలను పక్కకు జరిపారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి