ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఎంతోమంది ద
దారిద్ర రేఖ దిగువన వున్న నిరుపేదలు కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత... ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డులు వస్తాయా, రావా అన్న గందరగోళం లో ప్రజలు ఉన్నారనే చెప్పాలి. మరోవైపు మీసేవ సెంటర్లో కూడా ఎంతోమంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కొత్త రేషన్ కార్డు నిరుపేదలకు అందని ద్రాక్షలా మిగిలిందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో కొంతమందికి రేషన్ కార్డులు వచ్చినట్లు లిస్టులో పేర్లు వచ్చాయి. రెవెన్యూ అధికారులు కూడా గ్రామాల్లో తిరిగి సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇంకా చాలా మందికి రేషన్ కార్డులు రావాల్సి ఉంది. మిగతా వారికి కూడా రేషన్ కార్డులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మీసేవ సెంటర్లో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
పాత రేషన్ కార్డులో మీ పేరు ఉంటే తహసిల్దార్ కార్యాలయం కి వెళ్ళి పేరును తొలగించిన తర్వాత మీసేవ సెంటర్లోకి వెళ్లి కొత్త రేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి