కార్మికుల సంక్షేమమే AITUC ధ్యేయం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మేకల ఈశ్వర్ రావు.🚩🚩




మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 శుక్రవారం పీవీ కాలనీ కేఎల్ మహేంద్ర భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో

 మణుగూరు ఏరియా 4వ స్ట్రక్చర్ సమావేశాల మేకల ఈశ్వర్ రావు ఇలా వివరాలు   తెలియజేశారు.

1. జి ఎం ఆఫీస్ వద్దనున్న 

 జి ఎల్ సంప్ లో కంప్రెసర్ మరియు బ్లోయర్ సిస్టం పనిచేయక నీరు శుద్ధి కాకపోవడం చేత అపరిశుభ్రమైన నీరు సరఫరా అవుతున్నదని కావున వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరా మనీ 

2. భద్రాద్రి స్టేడియంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ ఫూల్ లో 5hp మోటార్ పనిచేయడం లేదు, వెంటనే రీప్లేస్ చేయించాలని కోరామని.

3. మైన్స్ వద్ద మ్యాన్ వేలలో 

 డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరాము 

4. ఏరియా వర్క్ షాప్ నందు మహిళా ఉద్యోగులకు వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరాము.

5. డయల్ యువర్ జిఎం కార్యక్రమాన్ని మణుగూరు ఏరియాలో పునరుద్ధరించాలి 

6. KCHP నుండి PKOC 2

 సైట్ ఆఫీస్ వరకు మూడు చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి, జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

7. మణుగూరు ఓసి,OC4,KCHP ఫ్రీవే బిన్ ల లో పనిచేస్తున్న ఆపరేటర్ లకు సూటబుల్ డెసిగ్నేషన్ ఇవ్వాలి.

8. క్వాలిటీ డిపార్ట్మెంట్ పటిష్టపరిచి, మ్యాన్ పవర్ ఇవ్వాలి.

9. గతంలో ఇచ్చిన మాదిరిగానే కార్మికులందరికీ వేసవికాలం దృష్ట్యా

2 లీటర్స్ కూల్ వాటర్ క్యాన్ లను అందజేయాలి.

 తదితర అంశాలను ప్రస్తావించామని అన్నారు.

 ఈ అంశాల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని అన్నారు.

 కావున కార్మిక సోదరులు అనుక్షణం కార్మిక శ్రేయస్సు కొరకు పోరాడి హక్కులు సాధించిపెట్టే AITUC యూనియన్ ని ఆదరించి బలపరచాలని కోరారు

  బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ మల్లెల రామ నరసయ్య  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆఫీస్ బేరర్స్ కామ్రేడ్ గోలీ గంగాధర్ రావు, ఆవుల నాగరాజు, పిట్ సెక్రటరీలు ఈసం శ్రీనివాసరావు, బంగారి రవికుమార్, సొసైటీ డైరెక్టర్ జానకి ప్రసాద్, మట్టపర్తి నాగరాజు, ఏ చంద్రశేఖర్, భీమ్సేన్, ఆర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

                                

ఇది కూడా చదవండి... హిజ్రా ఉరి వేసుకుని హత్మహత్య


దేవత లాంటి డాక్టరమ్మ

Post a Comment

కొత్తది పాతది