చిల్లర దొరకట్లేదు బాబోయ్...!



వ్యాపారస్తులకు, ప్రజలపై తీవ్ర ప్రభావం...!



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



బయట ఏమైనా కొందామని ఏ షాపుకు వెళ్ళినా 'చిల్లర లేదు' అనే మాటే వినిపిస్తుంది అని చెప్పాలి. ఓ వైపు వ్యాపారాలు,మరో వైపు ప్రజలు 10,20 నోట్ల చిల్లర దొరకక నానా అవస్తలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కొరత ఎక్కువ ఉందని చెప్పొచ్చు. డిజిటల్ ఉన్నప్పటికీ... చిల్లర కొరత మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిల్లర లేక కావాల్సిన వస్తువు కొనలేక ప్రజలు.... మరోవైపు గిరాకీలు పోగొట్టుకుంటున్న వ్యాపారస్తులకు రెండువైపులా నష్టం జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. గత కొంతకాలంగా ఆర్బిఐ 10, 20 నోట్ల ముద్రణ లేకపోవడమే అని పలువురు నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న నోట్ల కొరత లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన ఎంతైనా ఉందని చెప్పాలి.


ఇది కూడా చదవండి...

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్


మానవత్వం చాటుకున్న గ్రామస్తులు


కిరాణా దుకాణంలో నాటు సారా పట్టివేత




Post a Comment

కొత్తది పాతది