మే 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

G Rajashekar
By -
0




మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 మణుగూరు మండలం సదస్సు

 citu జిల్లా కార్యదర్శి ఏజే రమేష్



 మే 20 తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మణుగూరు మండలం CITU సదస్సు అధ్యక్షతన ఉప్పతల నరసింహారావు నిర్వహించడం జరిగింది 

దీనికీ ముఖ్య అతిథిCITU ఏజే రమేష్ జిల్లా కార్యదర్శి

 మే 20 నా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న citu ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం నిసిగ్గుగా ప్రజా వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తున్నది ప్రజలను మతముస్కులో ముంచి ప్రజలపై అధిక బారాలు మోపుతున్నదని విమర్శించారు. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాచి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడలను తీసుకొచ్చిందని వెంటనే లేబర్ కోడులను విరమించుకోవాలని లేనిచో ప్రభుత్వము ప్రజా అగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా వ్యవసాయం ఈరోజు దేశంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని నేడు యువత నష్టాల్లో ఉన్న వ్యవసాయం చేయడానికి ముందుకు రావడంలేదని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చట్టం పార్లమెంట్లో చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామీణ పేదలను ఎంతో కొంత ఆదుకుంటున్నా ఉపాధి హామీ చట్టానికి రోజురోజుకు నిధులు కోత పెడుతూ పని దినాలు తగ్గిస్తున్నదని దీనివలన గ్రామీణ పేదల ఆదాయాలలో కోతపడుతుందని అన్నారు. అందువలన ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న మే 20 సార్వత్రిక సమ్మెను పారిశ్రామిక కార్మికులు అసంఘటిత కార్మికులు రైతాంగము వ్యవసాయ కూలీలు సమస్త పేద ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సత్ర పల్లి సాంబశివరావు. రంగా మిడ్ డే మిల్స్ నాయకురాలు శైలజ. పద్మ అరుణ. మున్సిపాలిటీ నాయకులు సురేష్. హేమంతరావు. పాయం సూరయ్య . కారం రమణ. కారం నాగేంద్ర . తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)