పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డిగూడెం గ్రామం లో DCMS వరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధ్యాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన *పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు* వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్ష పార్టీ అని రైతుల కొరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కింట సన్నబియానికి 500 రూ బోనస్ ఇచ్చి రైతు కష్టానికి ప్రతిఫలం చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోకూడదని రైతులంతా కూడా పండించినటువంటి పంట కొనుగోలు కేంద్రంలోని అమ్మి మంచి లాభాలను పొందాలని తెలియజేశారు ఏ గ్రేట్ సన్నబియ్యానికి క్వింటాకు 2320 రూపాయలు, కామన్ గ్రేడ్ దొడ్డు రకం క్వింటాకు 2300 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేసిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌ!!శ్రీ!! పాయం వెంకటేశ్వర్లు గారు*
ఈ యొక్క కార్యక్రమానికి AD తాతారావు. గారు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు రైతులు,తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి