భద్రాచలంలో గంజాయి సీజ్.. ఇద్దరు అరెస్ట్



 EB NEWS/భద్రాచలం:


భద్రాచలం: పట్టణంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం నిర్వహించిన తనిఖీల్లో 7.4 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న బొడ్డు చందు, కూరాకుల రోహిత్ అనే ఇద్దరిని అధికారులు పట్టుకున్నారు.


నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వాటి మొత్తం విలువ సుమారు రూ. 4.90 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.


పట్టుబడిన నిందితులను అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.


Post a Comment

కొత్తది పాతది