EB NEWS/ఖమ్మం:
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు కట్టలేరు బ్రిడ్జిపై విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్రిడ్జి పైనుండి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో మొండెం నుండి తల వేరైనట్లు తెలుస్తోంది.
ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి