పినపాక: బిజేపీ మండల అధ్యక్షులు ముందస్తు అరెస్ట్



EB NEWS/పినపాక:


భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పినపాక మండల అధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.


ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తనను అరెస్టు చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.


ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులతో తమ ఉద్యమాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.


Post a Comment

కొత్తది పాతది