భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంగళవారం ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.
ఒడిస్సా నుంచి జహీరాబాద్‌కు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరి రావు బృందం ఇసుక ర్యాంపు వద్ద పట్టుకుంది.
తనిఖీల్లో కారులో దాచిపెట్టిన సుమారు 52.1 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ దాదాపు రూ.41 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి తరలించడానికి ఉపయోగించిన కారును సీజ్ చేశారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి