పినపాక : రూట్ మ్యాప్ రెడీ.... బస్ రాక ఎప్పుడో?




EB NEWS/పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, చింతల బయ్యారం, వెంకట్రావుపేట గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసును కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. 


అధికారులు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసినప్పటికీ బస్సులను ప్రారంభించలేదని వాపోతున్నారు. 


విద్యార్థులు, వృద్దులు, చిన్న పిల్లలు ప్రయాణాలు చేయాలంటే నానా అవస్థలు పాడుతున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాల మీద ఆధారపడే స్తొమత లేదని, ఇకనైనా బస్ సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment

కొత్తది పాతది