EB NEWS/భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో హృద్యమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాటి కృష్ణకుమారి ప్రసవ వేదనతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఈఎంటి రాము, పైలట్ చీమల వేగంగా స్పందించి గర్భిణిని ఆసుపత్రికి తరలించడం ప్రారంభించారు. అయితే మార్గమధ్యంలోనే నొప్పులు తీవ్రంగా పెరగడంతో పరిస్థితి అత్యవసరంగా మారింది.
ఈ సమయంలో సిబ్బంది అసాధారణ చాకచక్యంతో, ధైర్యంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. కృష్ణకుమారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లి, శిశువు దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి