వీరు నాయక్ మృతిపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంతాపం
EB NEWS/మణుగూరు:
మణుగూరులోని రాధిక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వీరు నాయక్ (40) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరు నాయక్ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణవార్త తెలుసుకున్న రాధిక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరు నాయక్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

