భద్రాద్రి: విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి

G Rajashekar
By -
0




EB NEWS/జూలూరుపాడు: 


కారులో చిక్కుకుపోయి ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.


స్థానికుల వివరాల ప్రకారం.. వినోబానగర్ సర్పంచ్ గంగావత్ నవీన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె తన్విశ్రీ (4) ఇంటి వద్ద ఆడుకుంటూ సమీపంలో ఉన్న కారులోకి వెళ్లింది. చిన్నారి కారులోకి వెళ్లిన అనంతరం డోర్ లాక్ కావడంతో లోపలే చిక్కుకుపోయింది.


కుటుంబ సభ్యులు చిన్నారి కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. దాదాపు రెండు గంటల తర్వాత కారును పరిశీలించగా.. ముందు భాగంలోని రెండు సీట్ల మధ్య చిన్నారి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)