UPSC ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!!

G Rajashekar
By -
0

 



 120 మందికి 8 నెలల రెసిడెన్షియల్ కోచింగ్‌ !!


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌–2027కు సిద్ధమయ్యే రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. 


హైదరాబాద్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్‌లో శ్రీరామ్స్ ఐఏఎస్ భాగస్వామ్యంతో 120 మంది అభ్యర్థులకు 8 నెలల పాటు శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 


ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా *welfare.sriramsias.com* వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)