పినపాక: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై సురేష్

G Rajashekar
By -
0



EB NEWS/ PINAPAKA:


 సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏడూళ్లబయ్యారం ఎస్సై సురేష్ సూచించారు. అనుమానాస్పద లింకులు, గుర్తుతెలియని ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, ఎవరితోనూ ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను పంచుకోవద్దని సూచించారు.


సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు బుధవారం ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్, డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్ ప్రజలకు పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.


అలాగే యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా నష్టపోయే అవకాశం ఉందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో పయనించాలని ఎస్సై సురేష్ కోరారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)