తెలంగాణ: కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

G Rajashekar
By -
0

 



EB NEWS/హైదరాబాద్:


 రాష్ట్రంలో కొత్తగా చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెన్షన్ల దరఖాస్తు గడువును **సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది.** గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉంది.


అయితే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హత ఉన్న వారు సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.


కాగా, సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు **4.50 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు** సమాచారం. గడువు పొడిగింపుతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)