EB NEWS/భద్రాద్రి:
తుక్కుగూడలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి హత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది.
కేసు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ అధికారులను ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేసు దర్యాప్తు పురోగతి, తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలతో **7 రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్టు (ATR)** సమర్పించాలని తెలంగాణ డీజీపీని కమిషన్ ఆదేశించింది. ఘటనపై జాతీయ మహిళా కమిషన్ నేరుగా దృష్టి సారించడంతో కేసు దర్యాప్తుపై మరింత వేగం పెరగనుంది.

