అశ్వాపురం: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

G Rajashekar
By -
0



 EB NEWS/అశ్వాపురం:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో 01.09.2026న ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి భద్రాచలం, మణుగూరు, ఏటూరునాగారం మీదుగా షిర్డీకి టాటా నెక్సాన్ కారులో భార్యాభర్తలు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల అనుమతితో అశ్వాపురం ఎస్‌ఐ రాజేష్ తన సిబ్బందితో కలిసి గొల్లగూడెం గ్రామ శివారులోని సీతారాం కెనాల్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో OD 30 E 0342 నంబర్ గల టాటా నెక్సాన్ కారును ఆపి తనిఖీ చేయగా, కారు వెనుక డిక్కీలో అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల 560 గ్రాముల నిషేధిత గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా:

అరబిందో బిశ్వాస్, S/o రతన్ బిశ్వాస్, వయస్సు 33 సంవత్సరాలు, కలిమెల పోలీస్ స్టేషన్ పరిధి, మల్కన్‌గిరి జిల్లా, ఒడిశా రాష్ట్రం.

సుప్రియ బిశ్వాస్, వయస్సు 26 సంవత్సరాలు, అరబిందో బిశ్వాస్ భార్య.

విచారణలో వారు కలిమెలలోని సాలబాగ్ గ్రామానికి చెందిన హరిశ్చంద్ర మిస్త్రీ, సుశాంత్ మండల్ అనే ఇద్దరి వద్ద నుంచి గంజాయిని తీసుకుని, షిర్డీలోని రోహిత్ యాబిన్ అనే వ్యక్తికి సరఫరా చేసేందుకు వెళ్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై అశ్వాపురం ఎస్‌ఐ రాజేష్ ఫిర్యాదు మేరకు అశ్వాపురం ఇన్‌స్పెక్టర్ ఎల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులు, సరఫరా నెట్‌వర్క్‌పై కూడా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)