సిద్ధి వినాయకుడి లడ్డూకు రూ.43,016

G Rajashekar
By -
0

 




EB NEWS/మణుగూరు : 


శ్రీశ్రీశ్రీ సిద్ధి వినాయక స్వామివారి బాల గణేష్ తారక్ యూత్ ఆధ్వర్యంలో ఆదర్శనగర్‌లోని హెచ్.పీ. గ్యాస్ గోడౌన్ ఎదురుగా నిర్వహిస్తున్న ప్రథమ నవరాత్రోత్సవాల్లో లడ్డు వేలంపాట ఆసక్తికరంగా సాగింది.

వేలంపాటలో పోటీ నెలకొనగా.. చివరికి రూ.43,016లకు లడ్డూను దేవుడి పేరు మీద ఓ భక్తుడు దక్కించుకున్నారు. దీంతో నవరాత్రోత్సవాల్లో లడ్డు వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


వినాయకుడి ఆశీస్సులతో లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)