భద్రాచలంలో నిమజ్జన వేళ క్రేన్ బోల్తా

G Rajashekar
By -
0

 



తీగలు తెగిపోవడంతో ఘటన..

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం


EB NEWS/భద్రాచలం: 


గణేష్ నిమజ్జనాల సందర్భంగా భద్రాచలం గోదావరి వద్ద శుక్రవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా తీగలు తెగిపోవడంతో సింగరేణికి చెందిన క్రేన్ బోల్తా పడింది. ఈ ఘటనలో నిమజ్జనం చేస్తున్న విగ్రహం కిందపడి విరిగిపోయింది.


క్రేన్ బోల్తా పడే సమయంలో డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకడంతో ప్రమాదం తప్పింది. దీంతో కొద్దిసేపు నిమజ్జన కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. ఘటనతో అక్కడున్న భక్తులు కాసేపు భయాందోళనకు గురయ్యారు.


తరువాత పరిస్థితిని చక్కదిద్ది నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించినట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)