కుక్క కరవకపోయినా రేబీస్‌తో బాలుడు మృతి.. ఎలా జరిగిందంటే?

G Rajashekar
By -
0

 



గాయంపై వీధికుక్క లాలాజలం పడటంతో వైరస్ సోకినట్లు సమాచారం


EB NEWS/పల్నాడు జిల్లా: 



కుక్క కరిస్తేనే రేబీస్ వస్తుందని భావించడం సరికాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో రెండేళ్ల బాలుడు రేబీస్‌తో మృతి చెందిన ఘటన చర్చనీయాంశంగా మారింది.


రుద్రాన్ అనే రెండేళ్ల బాలుడి ముఖంపై గాయం ఉన్న సమయంలో, అతనితో తరచూ ఆడుకునే వీధికుక్క ఆ గాయాన్ని నాకినట్లు కుటుంబ సభ్యుల నుంచి సమాచారం. ఈ క్రమంలో కుక్క లాలాజలం గాయంపై పడటం ద్వారా రేబీస్ వైరస్ సోకినట్లు సమాచారం.


కుక్క లాలాజలం గాయాలు, కళ్లు, ముక్కు లేదా నోరు వంటి శరీర భాగాలకు తగిలినప్పుడు రేబీస్ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల కుక్క కరవకపోయినా, అనుమానాస్పద జంతువు లాలాజలం గాయంపై లేదా శరీరంలోని సున్నితమైన భాగాలపై పడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


గమనిక: రేబీస్‌కు సంబంధించిన అనుమానాస్పద ఎక్స్‌పోజర్ జరిగినప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవడం అత్యంత ముఖ్యం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)