ఆత్మీయ ఆహ్వానం పలికిన గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు
EB NEWS/హైదరాబాద్, సెప్టెంబర్ 19:
తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే ఖైరతాబాద్ శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆత్మీయ ఆహ్వానం మేరకు *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు* ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ ప్రతినిధులు *ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని* ఆత్మీయంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ వాణి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిషోర్ యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

