EB NEWS/ములుగు జిల్లా:
గోవిందరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.14 వేల లంచం తీసుకుంటున్న గోవిందరావుపేట తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.
ఓ పని నిమిత్తం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడి చేసినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటున్న సమయంలో తహసీల్దార్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. కేసు నమోదు, తదుపరి చర్యలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

