భద్రాద్రి : మృత్యుంజయుడు.. పసిగుడ్డుకు పునర్జన్మ!

G Rajashekar
By -
0

 


EB NEWS/భద్రాద్రి:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అద్భుతం సృష్టించారు. శ్వాస, గుండె స్పందన పూర్తిగా నిలిచిపోయిన అత్యంత క్లిష్ట స్థితిలో మూడు నెలల పసికందును ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్పందించిన డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ బృందం అత్యవసర చికిత్స ప్రారంభించింది.


మూడు విడతలుగా సీపీఆర్ నిర్వహిస్తూ, అవసరమైన అడ్రినలిన్ డోసులు అందించారు. వైద్యుల అలుపెరుగని ప్రయత్నం ఫలించి, కొద్ది సేపటికి చిన్నారి గుండె మళ్లీ స్పందించడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.


ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడిని మెరుగైన వైద్య సేవల కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వైద్యుల నిబద్ధత, అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)