పినపాక: వైద్య ఖర్చులకు సహాయం అందించిన జనం కోసం మనం

G Rajashekar
By -
0


 EB NEWS/పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన గుండారపు సమ్మక్క(52) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆమె వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిరుపేద కుటుంబానికి చెందిన సమ్మక్కకు వైద్యం చేయించుకోవడానికి అవసరమైన డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ కూలి పనికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి ఉండటంతో ఖరీదైన వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్చంద సంస్థ 10 వేల రూపాయలను వారి కుటుంబసభ్యులను కలిసి సహాయంగా అందించారు ఈకార్యక్రమంలో సంస్థ సభ్యులు వేముల భాస్కర్, బండారు సురేష్, sk అజారుద్దీన్ పాల్గున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)