ఇందిరమ్మ రాజ్యంలో ఊరూ-వాడా గృహప్రవేశాలు

G Rajashekar
By -
0



 EB NEWS/అశ్వాపురం:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సదురు జగ్గారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మించిన నూతన గృహాలకు గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, అర్హులైన నిరుపేద లబ్దిదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో తమ స్వంత ఇళ్లను నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గృహప్రవేశం చేసిన కుటుంబాలను అభినందించారు.


ఇంటి ఆడబిడ్డలకు నూతన వస్త్రాలు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని,   అర్హత కలిగిన ప్రతి  కుటుంబానికి ఇల్లు అందేలా కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.


ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)